టీయూవీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా బోడ సతీష్
తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం గ్రామానికి చెందిన బోడ సతీష్ ను తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలంగాణ ఉద్యమకారుల వేదిక వ్యవస్థాపక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వ్యవస్థాపక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, ఉమ్మడి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేశం, టి యు వి తాండూర్ మండల అధ్యక్షులు నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమకారులను ఐక్యం చేసే లక్ష్యంతో ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక వ్యవస్థాపక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వ్యవస్థాపక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, ఉమ్మడి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేశం బోడ సతీష్‌కు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా బోడ సతీష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, సంస్థ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.