బాయిబాట బాయ్ కాట్..

సింగరేణి జిడికె లెవన్ ఇంక్లైన్ గనిలో కవిత బాయి బాట.,
-మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించిన హెచ్ ఎం ఎస్ నేత రియాజ్ అహ్మద్
బాయిబాటను బహిష్కరించి -వెనుదిరిగిన మీడియా ప్రతినిధులు

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ బొగ్గు గనిపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించిన ‘బాయి బాట’లో కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

అయితే, ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రదాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పాత్రికేయులతో దురుసుగా ప్రవర్తిస్తూ… మీడియా అవసరం లేదంటూ మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన పాత్రికేయులు కార్యక్రమాన్ని బహిష్కరించి అక్కడి నుంచి వెనుదిరిగారు. మీడియా ప్రతినిధుల నిరసనతో కార్యక్రమం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like