పూరీలు చేసిన సీఎం
CM Revanth Reddy:రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో మొట్టమొదటి ఈ ఆదర్శ పాఠశాలను ప్రారంభించిన తర్వాత ఆవరణ తిరిగి పరిశీలించారు. ఇదే సందర్భంగా పాఠశాలల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన నృత్యం, సంగీతం బోధించే తరగతి గదులు, డిజిటల్ క్లాసులను సందర్శించారు.
ముఖ్యమంత్రి వంట గది పరిశీలిస్తున్న సందర్భంలో . వంటవారితో మాట్లాడుతూ కాసేపు సరదాగా పూరీలు చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సౌకర్యాలు కల్పించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో ఇంగ్లీషులో బోధిస్తారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, సలహాదారులు కె. కేశవ రావు, శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.