భార్యభర్తల అనుమానాస్పద మృతి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ మండలం కోసార గ్రామపంచాయతీ పరిధిలోని భవానీ నగర్లో ఓ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బానోత్ రాజు, అతని భార్య సునీత మృతదేహాలు ఇంట్లో కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టి ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దంపతుల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో భవానీ నగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.