మంచిర్యాలకు కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో రేపు పర్యటించనున్నారు. లక్షెట్టిపేటతో పాటు పలు ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి సమస్యలను తెలుసుకుని పరామర్శించేందుకు ఈ పర్యటన చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం కానున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like