ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించాల‌ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయ‌న శుక్ర‌వారం తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ దేవయ్యలు పోలీస్ కమిషనర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసుల పురోగతిని కమిషనర్ సమీక్షించారు.

నేరాల నియంత్రణ కోసం రాత్రి వేళల్లో ప్రివెంటివ్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. సమస్యలు తలెత్తకముందే గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో సాంకేతికత వినియోగం మరింత పెరుగనున్న నేపథ్యంలో అధికారులు తమ సాంకేతిక నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని సూచించారు.

ప్రతి పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదుదారుల వివరాలను సమగ్రంగా ధృవీకరించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా, ఓర్పుతో వ్యవహరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా పనిచేసి ప్రజలకు చట్టబద్ధంగా న్యాయం చేయడమే ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యత అని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.

You might also like