ప్రధాన్ రాజీనామా వెనుక… ప్రధాని వ్యూహమిదే..
నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సీజేపీ నిరసనలు, యువత నిరసనల కారణంగా రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కేసుల్లో చిక్కుకోవద్దని, దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే తాను రాజీనామా చేస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. మొదట మంత్రి రాజీనామా అంగీకరించని మోదీ ప్రభుత్వం తర్వాత ఆయన రాజీనామాకు అంగీకరించింది. దీంతో అటు ప్రతిపక్షాలు, ఇటు సీజేపీ మిగతా వారంతా కేంద్రం తలొగ్గిందని తమ ప్రసంగాలు తాము చేస్తున్నారు.. కానీ, ఆ తర్వాత జరిగిన వ్యూహాత్మక మార్పుల వెనుక బిజెపి అగ్రనాయకత్వం వేసిన కీలక అంచనాలు ఉన్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు యువత నిరసన ఒక్కటే కారణం కాదని విశ్లేషకులు చెబుతున్నాఉ. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న “విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు-2026″ పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఎలాంటి వివాదాలు లేకుండా బిల్లును గట్టెక్కియాలని బీజేపీ భావిస్తోంది. సోమవారం ఈ బిల్లులు పార్లమెంట్ ఉభయసభల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో బిల్లుల విషయంలో ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా కేంద్రం ప్లాన్‌గా ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారని చెబుతున్నారు.
విదేశాల నుంచి వచ్చే నిధుల విషయంలో స్పష్టత, పారదర్శకత కోసం కేంద్రం ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం తీసుకువస్తోంది. విదేశీ నిధులు దేని కోసం స్వీకరిస్తున్నారో, ఆ పనికే కేటాయించాలని ఈ బిల్లు సూచిస్తుంది. ఏ రాష్ట్రం, ఎక్కడి ప్రజల కోసం నిధులు స్వీకరించారో వాటి కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా కొత్త బిల్లులో నియమాలను రూపొందిస్తుంది. విదేశీ నిధులు దేశభద్రత, రాజకీయ వ్యవస్థలు, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించకుండా చూడటం బిల్లు లక్ష్యం. ప్రతీ ఏడాది ఆదాయం, ఖర్చుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఎన్జీవో లేదా వేరే ఏదైనా సంస్థ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేస్తారు.
FCRA రిజిస్ట్రేషన్ రద్దయినా, గడువు ముగిసినా లేదా ఇతర కారణాలతో చెల్లుబాటు కాకపోయినా, సంబంధిత సంస్థ విదేశీ నిధులు, ఆస్తులపై ప్రభుత్వం నియంత్రణ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేక అధికారిని నియమించే ప్రతిపాదన బిల్లులో ఉంది. విదేశీ నిధుల విషయంలో చాలా రోజులుగా అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ నిధుల్ని దేశ ప్రయోజనాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మత సంస్థలు మతమార్పిడికి ఈ నిధుల్ని వాడుకుంటున్నారని కేంద్రం ఆరోపిస్తోంది. నిజానికి ఢిల్లీలో 2021 షాహీన్ భాగ్ అల్లర్ల సమయంలో, సీఏఏ నిరసనలో విదేశీ నిధులు ఉపయోగించారనే ఆరోపణ ఉంది.
ఇక ఇందులో ఇంకో అంశం కూడా ఉంది.. అదే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. త్వరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళన తమకు అనుకూలంగా వాడుకోవాలని బీజేపీ భావించింది. ప్రధాన్‌ను విద్యారంగ సమస్యల నుంచి తప్పించి, పార్టీ సంస్థాగత బాధ్యతలకు.. రాబోయే రాష్ట్ర ఎన్నికల బాధ్యతలకు ఉపయోగించుకోవడం ద్వారా అటు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చడం, ఇటు నాయకుడికి గౌరవప్రదమైన నిష్క్రమణ కల్పించడం అనే రెండు లక్ష్యాలను కేంద్రం సాధించడంతో పాటు బిల్లులకు రూట్ క్లియర్ చేయడం కూడా మోదీ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు.