గోలేటి CHPలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

BMS:సింగరేణి గోలేటి సీఎచ్‌పీలో తీవ్ర సిబ్బంది కొరత నెలకొన్న నేపథ్యంలో పూర్తి మ్యాన్‌పవర్‌ను వెంటనే నియమించాలని హెచ్‌ఎంఎస్ యూనియన్ డిమాండ్ చేసింది. పదవీ విరమణ చేసిన కార్మికుల స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఉద్యోగులపై పనిభారం పెరిగిందని యాజమాన్యానికి వినతిపత్రం అందజేసింది.

సింగరేణి గోలేటి సీఎచ్‌పీలో నెలకొన్న కార్మిక సమస్యల పరిష్కారం కోసం గోలేటి సీఎచ్‌పీ అధికారి ఎం. కోటయ్యకు హెచ్‌ఎంఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు పతెం రాజబాబు, సీఎచ్‌పీ పిట్ సెక్రటరీ ఎండి ఆరిఫ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో తీవ్రమైన సిబ్బంది కొరత ఏర్పడిందని నాయకులు తెలిపారు. ఐఈడీ నిబంధనల ప్రకారం అవసరమైన టెక్నీషియన్లు, సూపర్వైజర్లు, క్లర్కులు తదితర సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కార్మికులపై అధిక పనిభారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో కూడా కార్మికులకు సెలవులు మంజూరు చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ విఫలమైందని హెచ్‌ఎంఎస్ నాయకులు విమర్శించారు. గోలేటి సీఎచ్‌పీలో ఐఈడీ నిబంధనల ప్రకారం పూర్తి మ్యాన్‌పవర్‌ను వెంటనే నియమించాలని హెచ్‌ఎంఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు పతెం రాజబాబు డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయమైన సెలవులు కల్పించడంతో పాటు సురక్షితమైన పని వాతావరణాన్ని యాజమాన్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హెచ్‌ఎంఎస్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ ఏరియా ఆర్గనైజర్ ఎంబడి ప్రశాంత్, కార్యకర్తలు రాజేష్, జి. బాలేష్‌తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని హెచ్‌ఎంఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

You might also like