ట‌మాట లోడుతో వెళ్తున్న వాహ‌నం బోల్తా

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బ‌న మండ‌లం దేవాల‌గూడ సమీపంలో మంగళవారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో వాహ‌నం బోల్తా ప‌డింది. జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కాగ‌జ్‌న‌గ‌ర్‌కు టొమాటోలు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అందులో ఉన్న టామాటాలు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. వాహనం రోడ్డుకు అడ్డంగా పడడంతో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాన్ని పక్కకు తీయించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. మరో వాహ‌నాన్ని తీసుకొచ్చి కిందపడిన టమాటాలను అక్కడి నుంచి తరలించారు.

You might also like