అమెరికాలో అయ్యప్ప నామస్మరణ
స్వామి అయ్యప్ప శరణం.. అయ్యప్ప శరణం.. స్వామియే శరణం అయ్యప్ప అంటూ అమెరికా మారుమోగిపోతోంది. అమెరికాలోని పలు రాష్ట్రల్లో శరణుఘోష వినిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప మాల వేసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుననారు. వాషింగ్టన్ డీసీలో వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది అయ్యప్ప మాలాధారాలు, భక్తులు తరలిరావడంతో దేవాలయం కిక్కిరిసిపోయింది. అయ్యప్ప నామస్మరణతో హరిహరక్షేత్రం భక్తి పారవశ్యం ఉప్పొంగింది. ఆదివారం ఉదయం భక్తులు ఇరుముడి ధరించి స్వామి మాల విరమణ చేశారు.