గనులపై ఘనంగా రాఖీ వేడుకలు
Recover your password.
A password will be e-mailed to you.
సింగరేణిలో గనులపై రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ గనిలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిలే బీ షిఫ్ట్ ఇన్చార్జి జయంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా.. కార్మికులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్మికులందరూ సోదరభావంతో, ఐకమత్యంతో మెలగాలని జయంత్ కుమార్ ఆకాంక్షించారు. రాఖీ పండుగ స్ఫూర్తితో పరస్పరం ఆత్మీయతను పెంపొందించుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ రవికిరణ్, ఇంజనీర్ నాని, హెడ్ ఓవర్‌మెన్ వెంకటేశ్వర్లు, ఈపీ ఆపరేటర్లు, కార్మికులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఒకరికొకరు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలిపారు.