యువత భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి

మాదారం 3 ఇంక్లైన్ కార్డ‌న్ సెర్చ్

స‌మాజంలో నానాటికి పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలు అప్రమత్తం చేసేందుకు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ (Cordon Search ) నిర్వహిస్తున్నట్లు మాదారం ఎస్‌ఐ సౌజన్య వెల్ల‌డించారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్ షిప్‌లో బుధ‌వారం పోలీసు బృందాలు మాదారం 3 ఇంక్లైన్ లో తనిఖీలను నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ యువత చెడు మార్గాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు ఆకర్షితులు కాకుండా విద్య, ఉపాధి, క్రీడలు వంటి సానుకూల రంగాల్లో ముందుకు సాగాలని తెలిపారు.

మంచిర్యాలలో పోలీస్‌ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఉచిత పోలీస్‌ శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎస్‌ఐ సౌజన్య తెలిపారు. పోలీస్‌ ఉద్యోగాల్లో చేరాలనే ఆసక్తి, అర్హత ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణ పొందాలని ఆమె సూచించారు. ప్రజలు ఐక్యమత్యంగా ఉంటూ శాంతియుతంగా మెలగాలని, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

You might also like