కాంగ్రెస్ నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం
రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కోరకొప్పుల నీరజా తులసిరామ్ గౌడ్‌ను ఐఎన్‌టీయూసీ సెంట్రల్ కమిటీ మెంబర్ మడ్డి రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్య, కార్యదర్శి బుద్ధార్థి బుచ్చయ్య, గంటా వెంకటరమణారెడ్డి, రామగిరి మండల యూత్ అధ్యక్షుడు అవినాష్ గౌడ్, వీరగోని లక్ష్మయ్యగౌడ్, రామ్ నారాయణ, తాటికొండ మొగిలి, బుడిగే క్రాంతి కుమార్ గౌడ్, తాటి సతీష్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, ఎల్లంకి రామారావు, సందెల కుమార్, వుయ్యాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.