మంచిర్యాల కాంగ్రెస్ లో కలకలం

ఆరుగురు కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దండేపల్లి మండలం గూడెం గ్రామ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యలు కమిటీ చర్యలు చేపట్టింది.

కొందరు పార్టీ కార్యకర్తలు ఎంపీ వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేయడం, కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం వంటి ఆరోపణలపై ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

10 రోజుల్లోగా వ్యక్తిగతంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న వారిలో గడ్డం త్రిమూర్తి (జిల్లా అధ్యక్షుడు, RGPRS), అక్కల వెంకటేశ్వర్లు( మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, దండేపల్లి), అంకతి శ్రీనివాస్ (RTA మెంబర్, మంచిర్యాల), ముత్యాల శ్రీనివాస్ (మాజీ MPTC), లక్కకుల సృజన్, అకుల దుర్గ ప్రసాద్ ఉన్నారు.

నోటీసులు అందుకున్న వారంతా ఎమ్మ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు కావడం రాజకీయంగా ప్రాధాన్యాత సంతరించుకుంది.

You might also like