అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
శాసన సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ ఈ వర్తిస్తుందని ప్రకటించారు. బుధవారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. సభా కార్యకలాపాలకు బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడ్డారు. మంత్రులు మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు.
సభ్యులు సీట్లలో కూర్చోవాలని పదే పదే కోరారు. అయితే వాళ్లు తగ్గకపోవడంతో. దీంతో వాళ్లను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పీకర్ ను కోరారు. ఆ వెంటనే వాళ్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటు శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
ఈ సెషన్ పూర్తి అయ్యేంత వరకు 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ చేస్తున్నట్లు నిర్ణయించారు. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అనీల్ జాదవ్, గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, జగదీష్ రెడ్డి, సంజయ్‌కుమార్, కోవ లక్ష్మీ, మాధవరం కృష్ణారావు, మానిక్‌రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని సుధీర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.