కార్మికుల‌కు అన్యాయం జ‌రుగుతుంటే… ఆ సంఘాలు ఎక్క‌డున్న‌య్‌…?

సింగ‌రేణిలో కార్మికులకు అన్యాయం జ‌రుగుతుంటే క‌నీసం ప‌ట్టించుకోని కార్మిక సంఘాలు, నేత‌లు కార్మికుల హ‌క్కుల కోసం పోరాటం చేస్తున్నామ‌ని సిగ్గు చేట‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లు దుయ్య‌బ‌ట్టారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్‌కే-5లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని కార్మిక సంఘాల ప‌రిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ‌గా మారింద‌న్నారు. AITUC సమ్మె నోటీసు ఇచ్చి 24 డిమాండ్లు సాధించామ‌ని, తాము సంతకాలు పెట్టామని చెప్పిన విష‌యాన్ని వారు గుర్తు చేశారు. ఆ సంతకాల తడి ఆరకముందే అదే రోజు మెడికల్ బోర్డు లో ఇద్దరు మైనింగ్ సూపర్వైజర్లకు అండర్ గ్రౌండ్ అన్‌ఫిట్‌… ఫిట్ ఫర్ జనరల్ అసిస్టెంట్ అని యాజమాన్యం ఇచ్చింది.. ఇదేనా మీ అగ్రిమెంట్ అని ఎద్దేవా చేశారు. ఒకవేళ మీరు 24 డిమాండ్లు సాధిస్తే సింగరేణి యాజమాన్యం, ఆర్ ఎల్ సి దగ్గర మీరు చేసుకున్న ఒప్పందం 12(3) అగ్రిమెంట్ కార్మిక వర్గానికి చూపెట్టగలరా…? అని ఈ సంద‌ర్భంగా వారు ప్ర‌శ్నించారు.

ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు 60 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు కావస్తున్నా వాస్తవ లాభాలను చెప్ప‌క‌పోవ‌డంలో అంతర్యం ఏమిటని మిర్యాల‌, కేతిరెడ్డి నిల‌దీశారు. వెంటనే వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 36% లాభాల వాటాను కార్మికుల‌కు అంద‌చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి ఈ రోజు కార్మిక వర్గానికి గనులు డిపార్ట్మెంట్లలో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఎక్కడున్నారని….? నిల‌దీశారు. కనీసం రోజు వారీగా కార్మికులు ధరించే పి.పి.ఈ కిట్లను కూడా ఇప్పించలేని దయనీయమైన పరిస్థితులలో మీ కార్మిక సంఘాలు ఉన్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు.

కోల్ కట్టర్, టింబర్ మెన్ వాడే బిట్లు, రాడ్లు, లైన్మెన్ కీలలు, సిమెంట్ రెజిన్ క్యాప్సెల్స్ యాజమాన్యం సమకూర్చకపోతే ప్రశ్నించాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు నిద్ర పోతున్నాయా..? అని ప్రశ్నించారు… ఎర్రజెండాలు, పోరాటాలు, ఉద్యమాలు అని పోరాటాలకు పోజులు కొట్టే ఎర్రన్న సంఘాలు మొనగాడు సంఘాలు కార్మిక హక్కులను యాజమాన్యం ప్రభుత్వాలు హరించకపోతుంటే ఎక్కడున్నారని… అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రశ్నిస్తోంద‌ని మిర్యాల రాజిరెడ్డి, కేతిరెడ్డి సురేంద‌ర్ రెడ్డి అన్నారు. సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు (AITUC, INTUC) ఎన్నికల కాలపరిమితి అయినందున వెంటనే సింగరేణిలో ఎన్నికలు పెట్టాలని, లేకపోతే ఎన్నికలు నిర్వహించే వరకు రిజిస్టర్ సంఘాలన్నిటికీ సమాన హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.

టీబీజీకేఎస్ పోరాటాలకు ఆకర్షితులై ఈ రోజు ఆర్‌కే-5 గనిలో పని చేస్తున్న సీనియర్ కార్మిక నాయకుడు రామిడి మహేందర్ రెడ్డితో పాటు వివిధ సంఘాల నుండి 78 మంది కార్మికులు యూనియన్ లో చేరారు.. వారికి ముఖ్య అతిథులు కండువాలతో స్వాగతం ప‌లికారు. ఏరియా ఉపాధ్యక్షు బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన స‌మావేశంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పెట్టెం లక్ష్మణ్, సెంట్రల్ జాయింట్ సెక్రెటరీ పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, సెంట్రల్ చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీ అన్వేష్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి సెంట్రల్ ఆర్గనైజ్ సెక్రెటరీ ఎండి లాల, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అక్కురి సుబ్బన్న, ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్ శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి వెంగళ కుమార్, ఉడిమ్ మల్లేష్ ఫిట్ సెక్రటరీ దుర్గం రవి, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ పాపిరెడ్డి డివిజన్ నాయకులు గోవిందుల రమేష్, చంద్రగిరి మల్లేష్,చిప్ప రమేష్, సురేందర్ రెడ్డి, చిలుకూరి జగదీష్, దేవేందర్,రాజు నాయక్, జైపాలరెడ్డి, పాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

You might also like