బాల్ బాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపిక
మంచిర్యాల – సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లా గోలేటి నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోష్, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, న్యాయవాది ఎస్. రమేష్, పిఈటి భాస్కర్ సీనియర్ క్రీడాకారులు శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు 24 నుండి 26 వరకు హైదరాబాదులోని హెచ్ఏఎల్ క్రీడామైదానంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ నారాయణ రెడ్డి తెలిపారు.
బాలికల జట్టు
ఎస్ జ్యోతి, పీ శ్రావని, ఆర్ విష్ణు ప్రియ ,కె సుజాత ,పి సంజన ,టి ప్రజ్వల ,పీ శ్రావ్య ,ఎస్ సాయి శ్రీ వర్షిని ,జే హారిక ,ఎల్ ప్రణతి
బాలుర జట్టు
పీ సాయి చరణ్ ,జి రంజిత్ కుమార్ , ఎస్ నవనీత్, జి గోపాల్ , ఎస్ సత్య, అక్షయ్, శ్రీహిత్, సిహెచ్ వరుణ్ కుమార్