రేపు నిర్మల్‌లో రైతు ఆవేదన యాత్ర
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర బుధవారం నిర్మల్ జిల్లాలో కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతుండటంతో ఆవేదన చెందిన షర్మిల ఈ రైతు ఆవేదన యాత్ర తలపెట్టారు. రేపు నిర్మల్ జిల్లాలో ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఆ కుటుంబాలకు వైఎస్సార్‌టీపీ తరుఫున సాయం అందజేయనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పార్టీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ ప్రకటించారు.
జిల్లాలో షర్మిత రైతు ఆవేదన యాత్ర సాగుతుంది ఇలా…
నిర్మల్ నుంచి మంజులాపూర్ దిలావర్‌పూర్ మండలం కలువ తండా వెళ్తారు.
సారంగపూర్ నుంచి చించల్ ఎక్స్‌రోడ్ సారంగపూర్ మండలం రంగాపూర్ తండా వెళ్తారు..
మామడ మండలం తండ్రా గ్రామానికి వెళ్తారు. ఆయా ప్రాంతాల్లో రైతు కుటుంబాలను ఓదార్చుతారు.