సింగరేణి వాస్తవా లాభాల‌ వాటా ప్రకటించాలి

గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫ‌ల్యం వ‌ల్ల సింగ‌రేణిలో ద‌స‌రా స‌మీపిస్తున్నా కార్మికుల‌కు ఇప్పటివరకు లాభాల లెక్కలు చెప్ప‌డం లేదని టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సింగ‌రేణి కార్మికుల‌కు వాస్త‌వ లాభాలు ప్ర‌క‌టించాల‌నే డిమాండ్‌తో తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో సింగ‌రేణి వ్యాప్తంగా నిర‌స‌న చేప‌ట్టారు. దానిలో భాగంగా ఆర్జీ1 ఏరియా జీడీకే 2 ఇంక్లైన్‌లో మేనేజ‌ర్ దొంతల వెంకటేశ్వర్లకు విన‌తిప‌త్రం అందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు లాభాల వాటా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ద‌స‌రా స‌మీపిస్తున్నా క‌నీసం దాని గురించి మాట్లాడ‌క‌పోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. వెంట‌నే కార్మికులకు 36% లాభాల వాటా అందించాలని డిమాండ్ చేశారు.

కార్య‌క్ర‌మంలో పిట్ కార్యదర్శి ఉప్పులేటి తిరుపతి, నరేష్, అభిషేక్, మధు, భాస్కర్, ప్రదీప్ కుమార్, నరేష్, జస్వంత్, వేణు, రవి, శ్రీకాంత్, శ్రీధర్, రామకృష్ణ, అజయ్, ప్రవీణ్ రావు, శివ, అనిల్, భీమ్ రెడ్డి, రమేష్, సందీప్, అనిల్, ప్రవీణ్ టీబీజీకేస్ నాయకులు కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

You might also like