తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు..!
తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ వల్ల తెలంగాణ లో నీటి మట్టం పెరిగిందని ఈ నివేదికలో పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన కీలక పథకాల్లో ఒకటి మిషన్ కాకతీయ. రాష్ట్రం లోని 46,530 చెరువులను పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం 2014-15లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద చెరువుల పూడిక తీయడం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని కాగ్ పార్లమెంట్ కు నివేదిక సమర్పించింది. 2012-2013 లో తాము అధ్యయనం చేయగా 10టిఎంసి ల మేర భూగర్భ జలాలు ఉంటే ఇప్పుడు 11.4 టిఎంసీ లకు భూగర్భ జలాలు చేరాయని పేర్కొంది.
అయిదు దశల్లో చేపట్టిన ఈ పథకం ప్రభావం గురించి తెలుసుకోవడానికి అత్యధిక భూగర్భజలాలు వినియోగించే 9 ఎంపిక చేసిన ప్రాంతాల్లో మదింపు చేసినట్లు కాగ్ పేర్కొంది. అధ్యయనం చేసిన ఆయకట్టు ప్రాంతాల్లో భూగర్భ మట్టాలు పెరిగినట్లు తేలిందన్న విషయాన్ని స్పష్టం చేసింది. అక్కడ. 2012-13లో 10టీఎంసీల మేర భూగర్భ జలాలు ఉండగా 2016-17 నాటికి 11.4 టీఎంసీలకు చేరాయని వెల్లడించింది. ఈ పథకం అమలు చేసిన తర్వాత భూగర్భజలాలు అధికంగా వాడే బేసిన్ ల కేటగిరీని క్రిటికల్ కిందికి మార్చారని పేర్కొంది.