అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల – తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం నియోజకవర్గంలో పలు సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రారంభించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి పరంగా ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో చెన్నూరు నియోజకవర్గానికి అధికంగా నిధులు తీసకువస్తున్నామని చెప్పారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ప్రతి మూడు వార్డులకు ఒక మినీ ఫంక్షన్లు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీనివాస గార్డెన్ నుంచి గాంధారి వనం వరకు ఆర్అండ్‌బీ రోడ్డును రూ. 15 కోట్లతో ఫోర్‌లైన్లుగా మార్చుతామన్నారు. గాంధారి వనంలో 25 ఎకరాల్లో శిల్పారామం కోసం డీపీఆర్ కూడా తయారు చేశామన్నారు. మున్సిపాలిటీలోని ఠాగర్ స్టేడియంతో సహా మూడు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. బొక్కల గుట్ట పాలవాగు బ్రిడ్జి నుంచి ఖిలా మైసమ్మ గుడి వరకు రెండు కోట్లతో రోడ్డు నిర్మాణం సాగుతుందన్నారు. ఇలా అన్ని రకాలుగా నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్న కార్యక్రమాల వివరాలు ఇవే…
– క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.
– రామకృష్ణాపూర్ పట్టణంలో మూడు లక్షల రూపాయలతో ముదిరాజ్ సంఘం భవన ప్రహరీగోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
– క్యాతనపల్లి మున్సిపాలిటీలో 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నర్సరీని సందర్శించారు.
– రామకృష్ణాపూర్ పట్టణంలో తొలి విడతలో భాగంగా ఐదు లక్షల రూపాయలతో రజక సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
– మందమర్రి మున్సిపాలిటీలో 3,30 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసే సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులకు, 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే వైకుంఠధామం పనులకు 2.78 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే జంతు వధశాల పనులకు శంకుస్థాపన చేశారు.
– మందమర్రి పట్టణంలోని సీఈఆర్ క్లబ్ లో 67 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు.