ఓపెన్‌కాస్టులో ప్రమాదం… ఆపరేటర్ మృతి

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజునే జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. ఆర్జీ 3 ఏరియా ఓసీపీ 1 లో జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి… రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తుండగా, క్వారీ ఏరియాలో డంపర్ రివర్స్ తీస్తున్న క్రమంలో వెనక ఉన్న డంపర్ ను ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ఆపరేటర్ శ్రీనివాస్‌రావు మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.