ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు
మంచిర్యాల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, కార్యాలయాల వద్ద ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కేకే 1 ఇంక్లైన్‌లో ఉదయం జెండా ఆవిష్కరణ చేశారు. మేనేజర్ లక్ష్మీనారాయణ పతాకావిష్కరణ చేయగా, కార్యక్రమంలో ఎస్‌వో రమేష్, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ ప్రభాకర్, టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.