రైతు ఆత్మహత్యాయత్నం
కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ వద్ద ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం హత్తీ ఘాట్ శివారులోని భూమి సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆ రైతు ప్రజావాణి వద్దకు వచ్చాడు. భోరజ్ మండలం మాండగడకు చెందిన దేవన్న అనే రైతు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. తన సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన హత్తిఘాట్ శివారులో తన ఐదు ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోందని, ఇండస్ట్రియల్ కారిడార్ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని తిరుగుతున్నారు.
దేవన్న ప్రజావాణిలో మరోసారి తన బాధను చెప్పుకునేందు కు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు, సిబ్బంది హుటాహుటినా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.