సర్పంచ్ భర్త కు జైలు శిక్ష
మంచిర్యాల – ఆయన గ్రామ పంచాయతీ ప్రథమ పౌరురాలి భర్త.. గ్రామానికి ఆయనే ఆదర్శం కావాలి కానీ ఆయనే అటవీ పోడు భూముల పేరిట అడవి నరకడం మొదలు పెట్టాడు. అధికారులు వస్తే బెదిరింపులకు దిగాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి కేసు పెట్టారు. 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల ఫారెస్ట్ పరిధి లో బీమారం మండలం అరెపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో 200 మంది ప్రజలు కొన్ని రోజులు గా పోడు భూముల పేరిట పెద్ద పెద్ద వృక్షాలను నరుకుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారి ప్రజలకు నచ్చజెప్పారు. మళ్ళీ అటవీ భూమి లోకి వెళ్లి చెట్లు నరుకుతుంటే అటవీ శాఖ మంచిర్యాల పరిధి రేంజర్ రమేష్, శ్రీరాంపూర్ సిఐ రాజు, భీమారo ఎస్ఐ అశోక్ తహసీల్దార్ విచారణకు వెళ్లారు. అక్కడ అటవీ ప్రాంతంలో బైక్ ఉండగా దానిని స్వాధీనం చేసుకునే క్రమంలో అక్కడికి సర్పంచ్ భర్త అనపర్తి రమేష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ అటవీ భూములను చదును చేస్తున్న క్రమంలో అధికారులు సర్పంచ్ భర్త రమేష్ తో పాటు మరో వ్యక్తి ని గురువారం అరెస్ట్ చేశారు. శుక్రవారం చెన్నూర్ కోర్టు ముందు అటవీ శాఖ అధికారులు ప్రవేశ పెట్టగా చెన్నూరు జడ్జ్ సంపత్ సర్పంచ్ భర్త అనపర్తి రమేష్ తో పాటు రాం టెంకి రమేష్ కు 15 రోజుల జైల్ శిక్ష ను వేశారు.. నిందితులను లక్షట్ పెట్ సబ్ జైల్ కు తరలించారు…