శరణుఘోషతో మార్మోగిన జేఎన్టీయూ
అయ్యప్ప నామ సంకీర్తనలు, శరణుఘోషతో హైదరాబాద్ జేఎన్టీయూ మార్మోగింది. హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామికి మహాపడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కిషన్ బండారుపల్లి స్వామి (శంకర్స్వామి) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అష్టాభిషేకం, వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పడిపూజ , మహా హారతి నివేదించారు. జవహర్లాల్ నెహ్రూ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ మహాపడి పూజ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై పునీతులయ్యారు.