వేడుకలకు అనుమతి ఎలా ఇస్తారు..?
న్యూఇయర్ వేడుకలపై హైకోర్టులో పిటిషన్
నూతన సంవత్సర వేడుకల పై ప్రభుత్వం ఉత్తర్వుల పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్.. పేర్కొన్నారు. ఇతర రాష్ట్రల మాదిరి ఆంక్షలు పెట్టాలని హై కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్యాండమిక్,ఎపిడెమిక్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఓమిక్రాన్ ను కట్టడి చేయకుండా ఇష్టానుసారంగా న్యూ ఇయర్ వేడుకలను అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా 62 ఒమిక్రన్ కేసులు నమోదయ్యాయని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు పెట్టాలని పిటిషనర్ న్యాయస్థానాన్నికోరారు. దీనిపై రేపు విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.