శాంతిఖని తనిఖీ చేసిన డీడీఎంఎస్
శాంతిఖని గని పర్యవేక్షణలో భాగంగా గురువారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మెకానికల్ బి.రవీంద్ర శాంతిఖని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా బుధ, గురువారం రెండు రోజుల పాటు గనిలో ఉన్న బోల్టర్ మైనర్, మ్యాన్ వైండింగ్ షాఫ్ట్, పంపులు, బెల్టులు, చైర్ లిఫ్ట్ సిస్టమ్ తదితర ప్రాంతాల్లో పర్యవేక్షించారు. ఆయనతో పాటు ఏజెంట్ వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజనీర్ రామ్మూర్తి , బెల్లంపల్లి రీజినల్ సేఫ్టీ ఇంజనీర్ రామనాథం, శాంతిఖని గ్రూపు ఇంజినీర్ జి.కృష్ణమూర్తి, శాంతిఖని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, గని పిట్ ఇంజినీర్ రామప్రసాద్, రక్షణ అధికారి సుధీర్, అడిషనల్ మేనేజర్ రాజు, రాంబాబు ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆఫీసర్ రాంసాగర్ ఇంజనీర్ పాల్గొన్నారు..