నారాయణలో అలరించిన అకాడమిక్ ఫెయిర్
హన్మకొండ : హన్మకొండ నక్కలగుట్టలో ఉన్న నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన అకాడమిక్ ఫెయిర్ అలరించింది. ఈ కిడ్స్ విద్యార్థులతో ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రైవేటు లెక్చరర్ల రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో ఉన్న సృజనాత్మకత వెలికితీయవచ్చన్నారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం రిజ్వానా, ఆర్ఐ శ్రీనివాస్, సెంట్రల్ కో ఆర్డినేటర్ లూసీ, స్టేట్ కో ఆర్డినేటర్ సాయికృష్ణ, హారిక, మోనా, ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, ఏవో నాగరాజు, ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ మమత పాల్గొన్నారు.