ఉత్పత్తి… పురోగతి
తొమ్మిది నెలల్లో 93% శాతం ఉత్పత్తి - లక్ష్యం చేరేందుకు అధికారుల ప్రణాళికలు
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పుంజుకుంది. మొదటి త్రైమాసికంతో పాటు రెండో త్రైమాసికానికి లక్ష్యానికి చాలా దూరంగా ఉండగా మూడో త్రైమాసికానికి మాత్రం ఉత్పత్తిలో పుంజుకొని ముందుకు సాగుతోంది. మొదటి మూడు నెలల్లో లక్ష్యానికి 5 మిలియన్ టన్నుల దూరంలో ఉండగా, అర్ధ సంవత్సరంలో సైతం 4.51,95,00 టన్నుల దూరంలో ఉంది. లక్ష్యం 50.25 మిలియన్ టన్నులకు 46.51 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది.
సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ తో ముగిసిన 9నెలల కాలానికి 93 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. డిసెంబర్ 3 రోజుల పాటు సమ్మె జరగడంతో బొగ్గు ఉత్పత్తి తగ్గి 82శాతానికే పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన వచ్చే 3 నెలల్లో భారీగా బొగ్గు ఉత్పత్తి సాధించడం ద్వారా 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ లో 68,78,570 టన్నుల లక్ష్యానికి 56,52,634 టన్నుల ఉత్పత్తి సాధించింది. డిసెంబర్ లో మూడు రోజుల పాటు సమ్మె జరగడం వల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. డిసెంబర్ 82 శాతానికే బొగ్గు ఉత్పత్తి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ తో ముగిసిన 9నెలల కాలానికి 50.52 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 46.51 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది.
తొమ్మిది నెలల కాలంలో రామగుండం డివిజన్-3లో 112 శాతం, ఇల్లందులో 112శాతం, మణుగూరులో 111 శాతం, రామగుండం డివిజన్-2లో 109శాతం బొగ్గు ఉత్పత్తి సాధించి నిర్దేశిత లక్ష్యాలకు అదనంగా బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల లక్ష్యానికి 9నెలల్లో 46.51 మిలియన్ టన్నులు సాధించింది. వచ్చే 3 నెల లో 23.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనని యాజమాన్యం చెబుతున్నది.