బొగ్గు గనిలోకి భారీగా నీరు
తప్పిన పెను ప్రమాదం

భూపాలపల్లి కేటీకే 5 బొగ్గు గనిలో భారీగా నీరు చేరింది. ఆదివారం కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఫస్ట్ షిఫ్ట్ లో బారికేడ్ నుంచి నీరు లీక్ కావడంతో 10 డీప్ దగ్గరకు భారీగా నీరు చేరింది. అదే డీప్‌లో ఉన్న 150 HP మోటర్లు నీటిలో మునిగాయి. ఆదివారం అత్యవసర సిబ్బంది మినహా ఎవరూ గనిలో లేరు. ఉన్న కార్మికులు సైతం హుటాహుటిన బయటకు వచ్చారు. కార్మికులకు తప్పిన పెను ప్రమాదం తప్పిందని కార్మిక సంఘ నేతలు చెబుతున్నారు. సింగరేణి సంస్థకు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.