రేవంత్ రెడ్డికి కరోనా
హైదరాబాద్: టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ట్వీట్టర్ వేదికగా రేవంత్ తెలిపారు. నిన్నటి నుంచి జ్వరం, స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజివ్ గా తేలినట్టు తెలిపారు. దీంతో గత రెండు మూడు రోజుల నుంచి ఇటీవల తనతో సన్నిహితంగా మెదిలినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. అలాగే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఐసోలేషన్లో ఉన్నట్టు తెలిపారు.ఇటీవల రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో నాయకులు, అధికారులు టెన్షన్ ఉన్నారు.