రేపటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ
రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ తెలిపింది. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందు శనివారానికి బదులుగా మంగళవారం నుంచి పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీ నుంచి రేషన్ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రతి కార్డుపై 10 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు.