టీఆర్ఎస్ నేతల అరెస్ట్

పోలీసులు మంగళవారం పలువురు టీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం లోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భవనంలో టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు పై ఆరోపణల విషయంలో టిఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, కోవిడ్ నిబంధనలు పాటించలేదని జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, సుజాతనగర్, లక్ష్మిదేవిపల్లి ఎంపిపీలు టిఆర్ఎస్ నాయకులు ఆళ్ళ మురళి , తూము చౌదరి, టీబీజీకేఎస్ నాయకులు రజాక్ ను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ తరలించారు.