ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫొటో మార్ఫింగ్
బీఎస్పీ స్టేట్ చీఫ్ కో–ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో వైరల్ చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్వేరోస్ ఐటీ వింగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. పాస్టర్ పరంజ్యోతి రాజ్ పేరుతో క్రియేట్ చేసిన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారని స్వేరోస్ ఐటీ వింగ్ పేర్కొంది. పోలీసులు 469,506 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.