కోడి పందెంరాయుళ్ల అరెస్టు
కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై దాడి చేసిన పోలీసులు పన్నెండు మంది పందెం రాయుళ్ల అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ కోలాంగుడ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 12 మందిని అరెస్టు చేశారు. పెద్దంపేటకు చెందిన తనుగులరమేష్, మెరుగు అజయ్, అల్లం రవీందర్, రాకలా కుమార్, పెండ్రం ఏసురత్నం, అరక ప్రవీణ్, టీకానపల్లికి చెందిన గంగాధరి తిరుపతి, గంగాధరి విజయ్, బాలరావుపేటకు చెందిన ఎంగాని మధుసూదన్, జెండావెంకటాపూర్కు చెందిన ఎనగంటి రమేష్, పెట్టం శేఖర్, శాఖపూరి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రెండు కోడిపుంజులు, రూ. 26,340/ – నగదు, ఏడు కత్తులు, 12 సెల్ ఫోన్లు, 12 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్ ఐ లచ్చన్న, సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్,శ్రీనివాస్ లను సీఐ మహేందర్ అభినందించారు