హైదరాబాద్‌లో ముక్కోటి ఏర్పాట్లు..
ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు దేవాయాలు ముస్తాబవుతున్నాయి. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఎంసీహెచ్ దగ్గర ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఉదయం మూడు గంటల నుంచే వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. మూడు గంటలకు స్వామి వారికి సుప్రభాతం, 3.30 గంటలకు స్వామి వారికి అభిషేకం, నాలుగు గంటలకు తోమాల సేవ, 6 గంటలకు నేత్ర దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం, పల్లకి ఊరేగింపు ఉంటుంది. ఉదయం పది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రముఖ కళాకారులతో నాద నీరాజనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు వేంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు 9985172300, 929250475,9032445160 నంబర్లలో సంప్రదించాలని కోరారు. 14వ తేదీ శ్రీగోదాదేవీ కళ్యాణం, 16న కరినోము తదిరతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.