క్లాత్ మాస్కులు కొంపముంచుతాయి
20 నిమిషాల్లోనే ఒమిక్రాన్ బారిన పడేస్తాయి - తాజా అధ్యయనంలో వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ తన కోరలు చాచి ప్రళయం సృష్టిస్తున్న నేపథ్యంలో.. మాస్క్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏ రకమైన మాస్కులు.. ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయన్న అంశం పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇటీవల మాస్కుల మీద చేసిన పరిశీలనల ప్రకారం, క్లాత్ మాస్కులు వైరస్ నుండి తగినంత రక్షణను విఫలం అవుతాయని తేలింది.
ఓమ్రికాన్ ఒకరినుంచి ఒకరికి సోకడానికి కేవలం 20 నిమిషాలు చాలని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. చాలామంది మాస్క్ వల్ల ఊపరి ఆడడం లేదనో.. ఏదోలాంటి వాసన వస్తుందనో.. స్కిన్ పాడవుతుందనో.. అనేక కారణాల వల్ల తమ సౌలభ్యం కోసం N95 కంటే క్లాత్ మాస్క్‌ని ఎంచుకుంటున్నారు. దీంతో నిపుణులు సర్జికల్ మోడల్‌లతో పాటు క్లాత్ మాస్క్‌లను జత చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ఇక క్లాత్ మాస్కుల విషయానికి వస్తే.. కేవలం ఒక లేయర్ ఉన్న క్లాత్ మాస్క్‌లు larger dropletsను నిరోధించగలవు.. కానీ చిన్నగా ఉండే ఏరోసోల్‌లను క్లాత్ షీల్డ్ లు నిరోధించలేవు. క్లాత్ మాస్క్ లేదా సర్జికల్ మాస్క్ లు రెండింటి విషయంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ ను ఎక్కువగా వ్యాప్తి చెందించే విషయంలో.. తొందరగా సోకే విషయంలో పెద్దగా తేడా ఉండదు.
ఇద్దరు వ్యక్తులు మాస్క్ ధరించకపోతే.. వారిలో ఒకరికి ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, 15 నిమిషాల్లో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని డేటా చూపిస్తుంది. రెండో వ్యక్తి క్లాత్ మాస్క్ వేసుకుంటే వైరస్ సోకడానికి 20 నిమిషాలు పడుతుంది. ఇద్దరూ క్లాత్ మాస్క్‌లు ధరించినట్లయితే, 27 నిమిషాల్లో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది.