కార్మిక ప‌క్ష‌పాతి వెంక‌ట్రావ్

సింగ‌రేణివ్యాప్తంగా ఘ‌నంగా జ‌న్మ‌దిన వేడుక‌లు

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావ్ కార్మిక ప‌క్ష‌పాతి అని టీబీజీకేఎస్ నేత‌లు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న‌ జన్మదిన వేడుకలు సింగ‌రేణి వ్యాప్తంగా నిర్వ‌హించారు. అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ఘనంగా నిర్వహించారు. శనివారం బెల్లంపల్లి ఏరియాలోని సిహెచ్ పీ లో నిర్వహించిన వేడుకలలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మలరాజ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వేజ్ బోర్డ్ మెంబర్ గా సింగరేణి కార్మికులకు ఎనలేని సేవలను అందించార‌న్నారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడతార‌న్నారు. ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ లో ఫిట్ కార్యదర్శి కారనాథం వెంకటేష్ అబ్బాపూర్ ఓపెన్ కాస్ట్ లో అన్నం లక్ష్మయ్య, వర్క్ షాప్ లో రాజేశం జి ఎం ఆఫీసులో గడ్డం రవీందర్ ఏరియా ఆస్పత్రిలో సత్యనారాయణ తదితరులు పాల్గొని కేక్‌ కట్ చేశారు. కార్య‌క్ర‌మంలో ఫిట్ సెక్రటరీ మెరుగు రమేష్‌, సెంట్రల్ కమిటీ స‌భ్యుడు అబ్బుశ్రీనివాసరెడ్డి, రాజన్న, జీఎం కమిటీ స‌భ్యుడు మాంతు సమ్మయ్య, అలవేని సంపత్, గజెల్లీ చంద్రశేఖర్, చంద్రయ్య, లక్ష్మీనారాయణ, శ్యామ్ సుందర్ , స్వరూపరాణి, రసరంజని,తోకల శ్రీనివాస్,రామారావు,సంపత్ రావు, చంద్ర కుమార్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like