అంబురాన్నంటిన సంబురాలు

రైతుబంధు సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. జడ్పీటీసీ మేడి సునీత ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో మహిళలు పెద్ద ఎత్తున కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతులు పండించే పంటకు పెట్టుబడిగా సాయం డబ్బులు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. బతుకమ్మ, డీజే చప్పుళ్లతో ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడి రవి, ఎంపీటీసీ సంపత్, గ్రామ అధ్యక్షుడు, రైతుబంధు మహిళలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.