పోలీసులకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు
పోలీసు అధికారులు సిబ్బందికి బుధవారం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ నిర్ధారణ పరీక్షలు 97 మందికి నిర్వహించారు. ఇందులో 94 మందికి నెగటివ్ రాగా ముగ్గురికి మాత్రం పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన సిబ్బందికి ఏసీపీ మనోధైర్యాన్ని నింపారు. తాము ఎప్పుడు అందుబాటులో ఉంటామని వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ హోం ఐసోలేషన్ ఉండాలని కోరారు. డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తూ మందులు వాడాలని సూచించాచు. ఎట్టి పరిస్థితిలో మనో ధైర్యం కోల్పోవద్దని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్, ఇతర కార్యాలయాల్లో కూడా శానిటైజ్ చేసి శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో సిఐ నారాయణ, ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.