కరోనా వైరస్ గాలిలో ఎంత సేపు ఉంటుందంటే…?
కరోనా వైరస్ గాలిలో ఎంత సేపు ఉంటుందనే విషయంలో ఈ మధ్య కాలంలో పరిశోధనలు జరిగాయి. వాటి ప్రకారం కరోనా గాలిలో 20 నిమిషాలు ఉంటే, సోకే సామర్థ్యాన్ని 90శాతం కోల్పోతుందని ఓ పరిశోధన వెల్లడించింది. మొదటి ఐదు నిమిషాల్లో మాత్రం సోకే అవకాశం తీవ్రంగా ఉంటుందని పరిశోధన స్పష్టం చేసింది. పీల్చే గాలిలో వైరస్ ఎలా మనుగడ సాగిస్తుందనే దానిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్లు యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన అధ్యయనం తేల్చింది.
సామాజిక దూరం, మాస్క్ ధరించడంలాంటి వాటి వల్ల కరోనా రాకుండా అడ్డుకోవచ్చనే విషయం సైతం అధ్యయనం చెబుతోంది. “ప్రజలు సరిగా వెంటిలేషన్ లేని ప్రదేశాల్లో ఉంటే మాత్రం గాలిలో కాస్త ఎక్కువ సేపు ఉండే కరోనా సోకవచ్చునని అభిప్రాయపడింది అధ్యయనం. గాలిలో ఉండే చిన్న బిందువులలో వైరస్ ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే దానిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. కొవిడ్ వ్యాప్తి కట్టడికి మాస్కుల వాడకం గురించి నొక్కి చెప్పారు.