రాజీవ్ రహదారికి కొత్త కళ
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోకవర్గంలోని గోదావరి వంతెన నుంచి ఇందారం క్రాస్ రోడ్డు వరకు గల రాజీవ్ రహదారిలో రూ 4.50కోట్లతో జంక్షన్లు, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో రోడ్డు,భవనాల శాఖ కార్యాలయంలో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి వంతెన నుంచి ఇందారం క్రాస్ రోడ్డు వరకు 6.5 కిలో మీటర్ల రాజీవ్ రహదారిలో రూ 4.50కోట్లతో పలు జంక్షన్ల సుందరీ కరణ పనులు, రోడ్డుకు ఇరువైపులా చెట్ల పెంపకం, మురుగు కాలువల నిర్మాణం, ఇందారంలో సెంట్రల్ లైటింగ్, గ్రామ సుందరీకరణ లాంటి అభివృద్ధి పనుల చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాజీవ్ రహదారిలో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజినీరింగ్ అధి కారులతో చర్చించినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో హెచ్కఆర్ రోడ్ సీఈ మధుసూ దన్ రెడ్డి, జీఎం శ్రీనివాస్ రెడ్డి, రోడ్డు ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణ వర్మ, ఇందారం వైస్ ఎంపీపీ పెద్దపల్లి రమేశ్, కో ఆప్షన్ సభ్యుడు జైను ద్దీన్, నాయకులు గడ్డం ప్రసాద్ గౌడ్,అరికె సంతోష్ యాదవ్, జక్కుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.