పిండిగిర్నీ పై పడి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో పిండిగిర్నీ పట్టే మోటార్ బెల్ట్ పై పడి మాచర్ల కవిత(36) అనే మహిళ మృతి చెందినది. శుక్రవారం ఉదయం కవిత పిండి వంటలు చేసుకోవడానికి పిండి పట్టించడం కోసం గిర్ని వద్దకు వెళ్లింది. పిండి పడుతుండగా ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భోగి పండుగ రోజే కవిత మృతి చెందడంతో వారి కుటుంబంతో పాటు ఆ గ్రామంలో కూడా తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి.