ఉత్సాహానికి వయస్సు అడ్డురాలేదు
ఉత్సాహం ఉండే చాలు… అది పదహారేళ్లు… అరవై ఏండ్లు అయినా తేడా ఉండదు. ఆ ఉత్సాహమే ఈ అవ్వల్లో ఉంది. తమ వయస్సు ముఖ్యం కాదు.. సంస్కృతి, సంప్రదాయాలు అంటూ ముందుకు వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యువతులతో పాటు, 50సంవత్సరాలు దాటిన అమ్మమ్మలు, బామ్మలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పోటీలో ఆకర్షణగా నిల్చారు. ముగ్గులు వేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ముగ్గులను చూడటానికి మహిళలు. విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.