ఆ బాటిల్ ఖరీదు 4 కోట్లు

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. విస్కీ విషయంలో ఈ మాట సరిగ్గా సరిపోతుంది. విస్కీ ఎంత ఓల్డ్ స్టాక్ అయితే అంత డిమాండ్ ఉంటుంది. టర్కీలో ఒక విస్కీ బాటిల్ కోసం జరిగిన వేలం అందర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపులో జపాన్‌కు చెందిన సుంటోరీ అనే లిక్కర్ సంస్థ ఉత్పత్తి చేసిన ది యమజాకీ విస్కీని వేలానికి పెట్టారు. ఈ విస్కీ బాటిల్ 55 ఏళ్ల పాతది. 1960లో మూడు అరుదైన రకాలకు చెందిన సింగిల్ మాల్ట్ విస్కీలను బ్లెండ్ చేసి యమజాకీ విస్కీని తయారు చేశారు. ఈ వేలంలో మొత్తం 8 మంది పోటీపడ్డారు. చైనాకు చెందిన ఓ ప్రయాణీకుడు రికార్డు స్థాయిలో 4 కోట్ల 14 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు.

ఇదొక అందమైన గ్రీక శిల్పం వంటిదని సుంటోరీ కంపెనీ ఛీప్ బ్లెండర్ తెలిపారు. సుంటోరీ సంస్థ ఎప్పుడూ అరుదైన రకానికి చెందిన విస్కీని తయారు చేసి మార్కెట్‌లో లిమిటెడ్‌గా అందిస్తుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే సరఫరా చేస్తుంటుంది. 2020లో కేవలం వంద బాటిల్స్‌ను మాత్రమే మార్కెట్‌లో రిలీజ్ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like