జాతరకు ముందే జన సంద్రం
మేడారం : జాతర సమయంలో పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారనే ఉద్దేశంతో.. ముందుగానే భక్తులు మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మేడారంలో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఒడిషా నుంచి భక్తులు వచ్చారు. రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. సొంత వాహనాల్లో జనం పెద్ద ఎత్తున మేడారం వస్తున్నారు. ప్రభుత్వం బస్సులు సైతం నడిపిస్తుండటంతో జనం బస్సుల్లో సైతం వస్తున్నారు.