మరో కొత్త న్యూస్ ఛానల్
ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయిన నేపథ్యంలో జీ నెట్వర్క్ నుంచి మరో ఛానల్ రాబోతోంది. ఇప్పటికే దానికి సంబంధించి పనులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల 25న జీ నెట్వర్క్ చైర్మన్ చేతుల మీదుగా నాలుగు భాషల్లో ఛానళ్లను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాం వేదికగా ఈ ఛానళ్లు నడవనున్నాయి. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ప్రాంతీయ వార్తలను అందించనున్నారు. జీ నెట్వర్క్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. జీ న్యూస్‌కు సంబంధించిన ప్రోమోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ వేదికగా అందిస్తున్న ఈ వార్తలు అక్టోబర్, సెప్టెంబర్ వరకు శాటిలైట్ ప్రసారాలను సైతం అందించనున్నారు. గతంలో జీ న్యూస్ 24 గంటలు వార్తలు అందించేది. తర్వాత కాలంలో కేవలం ఎంటర్టైన్మెంట్కే పరిమితం అయ్యింది. ఈ నెల 25 నుంచి వార్తలను సైతం అందించనుంది. జీ నెట్వర్క్ సైతం డిజిటల్ మీడియాలోకి అడుగుపెడుతుండటంతో ప్రజలకు నాణ్యమైన వార్తాప్రసారాలు అందుతాయని వీక్షకులు ఆశిస్తున్నారు.