ఎనిమిది నెమళ్లు మృతి
వరంగల్ : వరంగల్ జిల్లాలో ఎనిమిది నెమళ్లు మృతి చెందడం కలకలం సృష్టించింది. పర్వతగిరి మండల శివారు దేవిలాల్ తండ లో ఈ నెమళ్లు మరణించిన విషయం వెలుగులోకి వచ్చింది. విషగులికలు కలిసిన నీళ్లను తాగి ఈ ఎనిమిది నెమళ్ళు మృతి చెందినట్లు భావిస్తున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.