యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి దర్శనానికి సుమారుగా గంటకు పైగా సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతిని నిరాకరించారు.